Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 22 Sep 2023 13:49 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’తో అందరికీ చేరువయ్యారు నటుడు కార్తికేయ (Karthikeya). ఈ హీరో తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహాశెట్టి నటించారు. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎటువంటి సమాచారం లేకుండా ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ కథకు క్లాక్స్‌ దర్శకత్వం వహించారు.

కుమార్తె మృతి.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ పోస్ట్

కథేంటంటే: డిసెంబరు-2012.. యుగాంతం జరగబోతుందంటూ ప్రచారం జోరు మీదున్న సమయమిది. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల లంక గ్రామమైన బెదురులంక ప్రజల్లో ఈ యుగాంతపు భయాలు అప్పటికే మరింతగా నాటుకుపోయాయి. దీంతో ఆ భయాల్ని.. ఊరి ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అందర్నీ దోచేయాలని ప్రణాళిక రచిస్తాడు ఆ గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే భూషణం (అజయ్‌ ఘోష్‌). తన ప్రణాళిక అమలు చేయడం కోసం బ్రహ్మం (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) అనే ఓ దొంగ బాబాను, డేనియల్‌ (రామ్‌ప్రసాద్‌) అనే ఫేక్‌ పాస్టర్‌ను పావులుగా ఎంచుకుంటాడు.  వారి సహాయంతో ఊరి ప్రజల బంగారం మొత్తం కొల్లగొట్టడానికి ఓ ఎత్తుగడ వేస్తాడు. సరిగ్గా అదే సమయానికి సిటీలో ఉద్యోగం మానేసి ఊరిలోకి అడుగుపెడతాడు శివ (కార్తికేయ). తన మనసుకు నచ్చినట్లు బతికే శివ.. బ్రహ్మం, డేనియల్‌ల మాటల్ని అసలు లెక్కచేయడు. ఆ వ్యక్తిత్వంతోనే ఊరిని దోచేయాలన్న భూషణం పన్నాగాలకు ఎదురు నిలుస్తాడు. ఈ క్రమంలోనే తనెంతగానో ప్రేమించిన ఆ ఊరి ప్రెసిడెంట్‌ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహా శెట్టి)కి, పుట్టిన ఊరికి, కన్నవాళ్లకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మరి ఆ తర్వాత ఏమైంది? యుగాంతం పేరుతో ఊరి ప్రజల్ని దోచేయాలనుకున్న భూషణం కుట్రల్ని అతనెలా తిప్పి కొట్టాడు? భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బ్రహ్మం, డేనియల్‌ల నిజ స్వరూపాల్ని ఎలా బయట పెట్టాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని