Dil Raju: దిల్‌రాజును పరామర్శించిన రామ్ చరణ్‌..

దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి సోమవారం మరణించారు. దీంతో టాలీవుడ్‌ ప్రముఖులు దిల్‌రాజును (Dil Raju) పరామర్శించి ఆయన్ను ఓదార్చుతున్నారు.

Published : 10 Oct 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నేడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిల్‌రాజును పరామర్శిస్తున్నారు.  దిల్‌రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా పాల్గొన్నారు. తనవంతు ధైర్యం చెప్పారు. ప్రకాశ్‌ రాజ్‌ను చూసిన దిల్‌రాజు ఒక్కసారిగా ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. హీరో రామ్ చరణ్‌, దిల్‌రాజు ఇంటికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను పలు నిర్మాణసంస్థలు పంచుకున్నాయి. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని