#NisChay: ‘వెల్‌కమ్‌ టు ది ఫ్యామిలీ బావ’

మెగా డాటర్‌ నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనల కారణంగా అతి కొద్దిమంది కుటుంబ

Published : 15 Aug 2020 01:17 IST

హైదరాబాద్‌: మెగా డాటర్‌ నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనల కారణంగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, అతిథులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా నిహారిక-చైతన్యల నిశ్చితార్థాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌లతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు నటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.  నిధి అగర్వాల్‌, సుశాంత్‌, రీతూ వర్మ తదితరులు నిహారిక-చైతన్యలకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.

‘‘ప్రియమైన సోదరి నిహారిక-చైతన్యలకు శుభాకాంక్షలు. మీరు జీవితంలో మరింత అత్యుత్తమంగా ఉండాలి. నిశ్చితార్థం సందర్భంగా మీకు ఇవే నా శుభాకాంక్షలు’’- ట్విటర్‌లో చరణ్‌

‘‘నా చిన్నారి సోదరి నిశ్చితార్థం జరిగింది. మా కుటుంబంలోకి స్వాగతం బావ’’ -ట్విటర్‌లో వరుణ్‌ తేజ్‌

‘‘మీ జంటకు శుభాకాంక్షలు’’-రానా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని