Rashmika Mandanna: ఆ పాపను ఎలా కలవాలన్న రష్మిక..

పాఠశాలలో తన స్నేహితులతో కలిసి ఓ చిన్నారి ‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘సామీ సామీ’ పాటకు డ్యాన్స్‌ చేసింది. ముద్దులొలికే ఆ పాప నృత్యాన్ని ఎవరో చిత్రీకరించగా, దాన్ని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘క్యూట్‌’ అంటూ ఆ పాటలో నర్తించిన కథానాయిక రష్మికను ట్యాగ్‌ చేశాడు.

Published : 15 Sep 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాఠశాలలో తన స్నేహితులతో కలిసి ఓ చిన్నారి ‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘సామీ సామీ’ పాటకు డ్యాన్స్‌ చేసింది. సంబంధిత వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముద్దులొలికే ఆ పాప నృత్యాన్ని ఎవరో చిత్రీకరించగా, దాన్ని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘క్యూట్‌’ అంటూ.. ఆ పాటలో నర్తించిన కథానాయిక రష్మికను ట్యాగ్‌ చేశాడు. ఆ వీడియోపై రష్మిక (Rashmika Mandanna) స్పందించింది. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిన్నారిని కలవాలనుందని, అది ఎలా సాధ్యమవుతుంతో చెప్పమని అభిమానులను కోరింది. రష్మికతోపాటు పలువురు నెటిజన్లు ఆ బాలికను మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తిని అడిగితే అడ్రస్‌ తెలుస్తుందని కొందరు, ఆ పాప నేపాల్‌కు చెందిందని, వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోందని మరికొందరు రష్మికకు సమాధానమిస్తున్నారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’లోని ఈ ఒక్కపాటే కాదు అన్నీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గతేడాది విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవల నిర్వహించిన ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా)’ వేడుకలో ఆరు అవార్డులు దక్కించుకుని, తన హవా చూపించింది. సుకుమార్‌ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ ఇటీవల ప్రారంభమైంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని