Rashmika: గర్ల్‌ఫ్రెండ్‌ శ్రీవల్లి

కథానాయిక రష్మిక ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉంది. ఒకటి సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప2’ కాగా, మరొకటి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్నారు.

Updated : 06 Apr 2024 12:10 IST

థానాయిక రష్మిక ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉంది. ఒకటి సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప2’ కాగా, మరొకటి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప2’ తెరకెక్కుతుండగా, ఓ అందమైన ప్రేమకథతో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ తెరకెక్కుతోంది. అటు శ్రీవల్లిగా, ఇటు ఓ కళాశాల విద్యార్థినిగా నటిస్తోందీమె. శుక్రవారం రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయా సినిమాల్లోని లుక్స్‌ని విడుదల చేశారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ‘పుష్ప 2’ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని