ఈసారి మంట మామూలుగా ఉండదు: రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అటు క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే ఇటు మాస్ అభిమానులనూ మెప్పిస్తున్నాడు. లవర్‌బాయ్‌గా పరిచయమైన రామ్.. సినిమాసినిమాకు కొత్తదనం చూపిస్తూ.. ‘ఇస్మార్ట్‌శంకర్’తో మాస్‌హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి మాస్ అభిమానులను అలరించేందుకు
ఘనంగా ‘రెడ్’ ప్రిరిలీజ్ వేడుక
ఇంటర్నెట్ డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అటు క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే ఇటు మాస్ అభిమానులనూ మెప్పిస్తున్నాడు. లవర్‌బాయ్‌గా పరిచయమైన రామ్.. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ.. ‘ఇస్మార్ట్‌శంకర్’తో మాస్‌హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి మాస్ అభిమానులను అలరించేందుకు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’తో సిద్ధమయ్యాడు. రామ్ ద్విపాత్రాభినయంతో డబుల్ దమాకా ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నివేదాపేతురాజ్, మాళవికాశర్మ, అమృతాఅయ్యర్ అలరించనున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 14న విడుదల కానుంది. కాగా.. మంగళవారం చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడారు.. ‘‘ఈ సినిమాలో అసలు హీరో నేను కాదు.. మా పెదనాన్న(నిర్మాత స్రవంతి రవికిషోర్). ఆయనతో చాలా సినిమాలు చేశాను. ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ ఆ చిన్నారిని ఎలా రక్షిస్తాడో.. కరోనా సమయంలో పెదనాన్న కూడా ఈ సినిమాను అలాగే కాపాడారు. ఆయనలో ఒక సల్మాన్‌ఖాన్ కనిపించారు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. ‘రెడ్ అనే నా బిడ్డను.. థియేటర్లలోనే విడుదల చేస్తా’ అని పట్టుబట్టి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. కిషోర్ తిరుమల.. ఒక క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారంటే చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన మాస్ సినిమా తీయడం ఏంటి..? అన్నారు. కానీ ఆయన ఏ సినిమా అయినా చేయగలరు. ఏదైనా రాయగలరు. ఇది ఆయన కెరీర్‌కు ఒక టీజర్ మాత్రమే. అసలైన సినిమా ముందుంది. ‘రెడ్’ అంటే నాకు గుర్తొచ్చేది మణిశర్మ.. అంతమంచి సంగీతం అందించారు. అమృత అయ్యర్‌ది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినా ఆమె చాలా బాగా నటించింది. మాళవికాశర్మ.. అనుకున్నది చేసేదాకా వదలదు. సినిమాలో బాగా చేసింది. నివేదాపేతురాజ్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతోంది.. నా ప్రతీ అడుగులోనూ అభిమానులదే కీలక పాత్ర. అందరికీ ధన్యవాదాలు. ఇక ’రెడ్’తో సంక్రాంతికి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. చివరగా ఓ మాట ‘ఈసారి మంట మామూలుగా ఉండదు’’ అని రామ్ ముగించారు.
ఇదీ చదవండి..
మోనాల్ గజ్జర్ చిందేసిన ఐటమ్ సాంగ్ చూశారా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్