RRR: రూ.వెయ్యికోట్లకు ఎత్తిన జెండా

‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ అంటూ పాడిన ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం బాక్సాఫీసు వద్ద రూ.వెయ్యికోట్లకు జెండా ఎగరేసింది. సినిమా విడుదలైన మొదటిరోజు నుంచి రికార్డుల దుమ్ము దులుపుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వసూళ్లు ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు దాటినట్టు ఆ చిత్ర వర్గాలు ప్రకటించాయి.

Updated : 11 Apr 2022 09:36 IST

‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ అంటూ పాడిన ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం బాక్సాఫీసు వద్ద రూ.వెయ్యికోట్లకు జెండా ఎగరేసింది. సినిమా విడుదలైన మొదటిరోజు నుంచి రికార్డుల దుమ్ము దులుపుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వసూళ్లు ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు దాటినట్టు ఆ చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఒక్క హిందీ వెర్షనే ఏకంగా రూ.220 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ట్విటర్‌లో సంతోషంగా ప్రకటించారు. ‘భారతీయ సినిమా వెయ్యికోట్ల మార్కు దాటడం అనేది ఒక కల. మా సామర్థ్యం మేరకు ఒక మంచి చిత్రాన్ని అందించాం. వెలకట్టలేని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించి ఆ కల నిజం చేశారు. ఈ సందర్భంగా తారక్‌, చరణ్‌ అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని