20కోట్ల హృదయాలను మీటి..

సాయిపల్లవి ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో జోరు కొనసాగిస్తోంది. నెట్టింట విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వీక్షణలు దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ గీతం.. ఇప్పుడు మరో మైలు రాయిని దాటింది. 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించి.. యూట్యూబ్‌లో

Updated : 25 May 2021 04:26 IST

సాయిపల్లవి ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో జోరు కొనసాగిస్తోంది. నెట్టింట విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వీక్షణలు దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ గీతం.. ఇప్పుడు మరో మైలు రాయిని దాటింది. 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించి.. యూట్యూబ్‌లో విజయవంతంగా దూసుకెళ్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని గీతమిది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించారు. పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యంతో కొత్త సొబగులద్దుకున్న ఈ తెలంగాణ జానపదాన్ని.. మంగ్లీ ఆలపించిన తీరు, దానికి హుషారెత్తించేలా సాయి పల్లవి కాలు కదిపిన విధానం పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఇప్పుడీ పాటకు యూట్యూబ్‌లో ఇంతటి ఆదరణ దక్కుతోందని చిత్ర బృందం చెబుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. కరోనా పరిస్థితులతో వాయిదా పడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని