Salman khan: తెర వెనకా మాది దృఢమైన స్నేహమే!

సినిమాల్లో తమకి నచ్చిన హీరో చేసే యాక్షన్‌ సన్నివేశాలకు ఉర్రూతలూగిపోతుంటారు అభిమానులు. మరి వారి అభిమాన నటుడికి ఇంకో యాక్షన్‌ హీరో తోడైతే.. ఆ సందడి ఎలా ఉంటుందో ‘పఠాన్‌’, ‘టైగర్‌ 3’ సినిమాలతో చూపించారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌లు.

Updated : 27 Nov 2023 09:28 IST

సినిమాల్లో తమకి నచ్చిన హీరో చేసే యాక్షన్‌ సన్నివేశాలకు ఉర్రూతలూగిపోతుంటారు అభిమానులు. మరి వారి అభిమాన నటుడికి ఇంకో యాక్షన్‌ హీరో తోడైతే.. ఆ సందడి ఎలా ఉంటుందో ‘పఠాన్‌’, ‘టైగర్‌ 3’ సినిమాలతో చూపించారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌లు. ఈ ఇద్దరూ ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రలో కనిపిస్తూ.. ప్రేక్షకులను కనువిందు చేశారు. సల్మాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘టైగర్‌ 3’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో షారుక్‌ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌.. షారుక్‌తో కలిసి నటించడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మా ఇద్దరి స్నేహం తెరపై కంటే తెర వెనకాలే దృఢంగా ఉంటుంది. ఆన్‌స్క్రీన్‌పైనే ఇంత బాగా కుదిరిందంటే.. బయట మేం ఎలా ఉంటామో మీరే అర్థం చేసుకోవచ్చు. ‘కరణ్‌ అర్జున్‌’ నుంచే ఆ అనుబంధం ఎలా ఉండేదో మీకు తెలుసు. మా బంధాన్ని చూసి అభిమానులు మమ్మల్ని ‘షోలే’ సినిమాలోని జై, వీరూ పాత్రలతో పోలుస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు సల్మాన్‌. త్వరలో వీరిద్దరు కలిసి ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని