Samantha: ఆ క్షణమే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది

‘‘అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటి ఉంటుందని తెలుసుకున్న క్షణమే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’’ అన్నారు కథానాయిక సమంత.

Updated : 19 Jan 2024 09:29 IST

‘‘అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటి ఉంటుందని తెలుసుకున్న క్షణమే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’’ అన్నారు కథానాయిక సమంత. గతేడాది ‘ఖుషి’, ‘శాకుంతలం’ చిత్రాలతో సందడి చేసిన ఆమె మళ్లీ పూర్తిస్థాయిలో కెరీర్‌పై దృష్టి పెట్టే ప్రయత్నంలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆమె... ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. జీవితంలో నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటన్న ఓ అభిమాని ప్రశ్నకి బదులుగా ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘నావైన ఇష్టాయిష్టాల్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాను. బహుశా నా జీవితంలో చోటు చేసుకున్న అతి ముఖ్యమైన తప్పు అదేనేమో. ఆ సందర్భంలో నా భాగస్వామి వల్ల నేను చాలావరకు ప్రభావితం అయ్యాన’’ంటూ తన జీవితానుభవం, వ్యక్తిగత ఎదుగుదల గురించి చెప్పింది సమంత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని