Samantha: మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా: సమంత

అగ్రకథానాయిక సమంత కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. ఓ వైపు ప్రేమకథా చిత్రాలు, మరోవైపు యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో ఆమె వరుస సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఆమె కథానాయికగా నటించిన...

Published : 29 Apr 2022 11:01 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. ఓ వైపు ప్రేమకథా చిత్రాలు, మరోవైపు యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఆమె కథానాయికగా నటించిన కోలీవుడ్‌ చిత్రం ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన సొంతం చేసుకుంది. సినిమాలో సామ్‌ నటన బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. మరోవైపు గురువారంతో సామ్‌ 35వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, తనకి పుట్టినరోజు, సినిమా విజయానికి సంబంధించి విషెస్‌ తెలిసిన వారందరికీ శుక్రవారం ఉదయం సామ్‌ థ్యాంక్యూ చెప్పారు. ‘నా పుట్టినరోజు నాడు మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. మనస్ఫూర్తిగా నేను మీ అందర్నీ ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరు నాలో ఉత్సాహాన్ని నింపారు’’ అని సామ్‌ రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని