Shruti Haasan: నాని 30... కీలకం శ్రుతి

ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో డబుల్‌ ట్రీట్‌ అందించింది శ్రుతిహాసన్‌.

Updated : 30 Apr 2023 12:39 IST

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో డబుల్‌ ట్రీట్‌ అందించింది శ్రుతిహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ చేస్తూనే.. మరోవైపు తన తొలి ఆంగ్ల చిత్రం ‘ది ఐ’పైనా దృష్టి సారించింది. కాగా, ఇప్పుడు చడీచప్పుడు లేకుండా నాని సినిమా కోసం రంగంలోకి దిగిపోయింది. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ‘నాని30’ వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పై ముస్తాబవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో శ్రుతి తళుక్కున మెరవనుంది. ఇందుకోసం శనివారమే ఆమె ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం నాని, శ్రుతితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, తీగల విజయేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు