Sonu sood: డీప్‌ ఫేక్‌ బారిన సోనూసూద్‌.. జాగ్రత్తగా ఉండాలని కోరిన నటుడు..

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ (Sonu sood) డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 20 Jan 2024 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే పలువురు ప్రముఖుల డీప్‌ ఫేక్‌ వీడియోల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనగా.. ఇప్పుడీ జాబితాలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ (Sonu sood) చేరారు. కష్టసమయాల్లో ఎంతో మందికి ఆయన అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్నారు. కొందరు ఆకతాయిలు ఇప్పుడు అతడి ఫేక్‌ వీడియోను రూపొందించి అభిమానులను డబ్బులు అడుగుతున్నారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సోనూసూద్‌ తన సోషల్‌ మీడియా ద్వారా సూచించారు.

‘కొందరు నా డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి అభిమానులతో చాటింగ్‌, వీడియో కాల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన కోరారు. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే.. తాను ‘ఫతే’ (FATEH) సినిమా తీస్తున్నట్లు చెప్పారు. డీప్ ఫేక్‌, లోన్‌ యాప్స్‌ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలను అందులో చూపించనున్నట్లు తెలిపారు.

ఓటీటీలోకి ‘యానిమల్‌’.. ఆ సీన్స్‌ యాడ్‌ చేస్తామన్న సందీప్‌

మొదట రష్మిక డీప్‌ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రాల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా దీని బారిన పడ్డారు. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని