Aadi: మా పెళ్లిచూపులు ఎయిర్‌పోర్టులో జరిగాయి.. హనీమూన్‌లోనే గొడవ పెట్టుకున్నాం: ఆది
సెలబ్రెటీ టాక్ షో ‘అలా మొదలైంది’కి నటుడు ఆది ఆయన భార్య అరుణతో కలిసి వచ్చారు. వారి జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు.
యువ కథానాయకుడు ఆది(aadhi).. తన భార్య అరుణతో కలిసి ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) కార్యక్రమానికి విచ్చేశారు. వీళ్లిద్దరూ సరదా ముచ్చట్లతో నవ్వులు పూయించారు. అరుణకు ఆది ఏం గిఫ్ట్ ఇచ్చారు.. ఆదికి అరుణ పెట్టిన కండీషన్ ఏంటో సరదాగా చెప్పారు. అలాగే వీళ్ల పెళ్లి చూపులు ఎయిర్ పోర్టులో ఎందుకు జరగాయో చెప్పారు. వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో ఆది జంట.. వాళ్ల వివాహ బంధం గురించి పంచుకున్న సరదా ముచ్చట్లేంటో మీరు చూడండి..
మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఆది: మా సిస్టర్ పెళ్లిలో నేను బాగా సందడి చేశాను. ఆ పెళ్లికి అరుణ వాళ్లు వచ్చారు. మొదటి సారి అప్పుడే తనని చూశాను. మా సిస్టర్ వాళ్ల మామయ్యగారికి, అరుణ వాళ్ల నాన్న ఫ్రెండ్. ఆయనే మా మామయ్యని పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా బావ ఫోన్ చేసి ఇలా అరుణ వాళ్లు పెళ్లి ప్రపోజల్ పెట్టారని చెప్పాడు. నాకు టైం కావాలని అడిగా. ఇంటికి వెళ్లాక ఫొటోస్ చూశాను.
అరుణ: మా నాన్న వాళ్లు నా పెళ్లి గురించి చర్చించుకుంటుంటే నేను, మా చెల్లి నిద్ర పోతున్నట్లు నటిస్తూ విన్నాం. తర్వాత ఆది గురించి గూగుల్ చేసి తెలుసుకున్నా. పెళ్లి కుదిరాక మా నాన్న దగ్గరకు వెళ్లి.. ‘సినిమా వాళ్లు కదా నాన్న పర్వాలేదా’ అని అడిగాను.
మీ పెళ్లిచూపులు ఎలా జరిగాయి?
అరుణ: ఎయిర్‌పోర్టులో జరిగాయి. మా మామయ్యగారు (సాయికుమార్) ఏదో ఊరు వెళ్తున్నారు. అనుకోకుండా మా పేరంట్స్ కూడా అదే టైంకి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఫోన్ చేసి ఎయిర్‌పోర్టుకు రా.. అన్నారు. నేను వెళ్లేసరికి వాళ్లంతా నా కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లిచూపులు అయ్యాక ఆది నా ఫోన్ నంబర్ అడిగితే మా నాన్నను అడిగి ఇచ్చాను. (ఆది అందుకొని.. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నువ్వు మీ నాన్నను అడిగి ఇచ్చావా నంబర్..!)
ఆది: అరుణ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాక ఇద్దరం పక్కకు వెళ్లి మాట్లాడుకున్నాం. నా ఫీల్డ్ గురించి చెప్పాను. సినిమా రంగంలో ఉండే ఒడుదొడుకులు చెప్పాను. అలా గంటసేపు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో మా తల్లిదండ్రులు వచ్చి ఆపేశారు. లేదంటే ఇంకా మాట్లాడుతూనే ఉండేవాళ్లం (నవ్వుతూ). కానీ, మొదటి సారి కలిసినప్పుడే తనతో నేను కలిసి ఉండగలననే నమ్మకం కలిగింది. అందుకే అదే రోజు ఓకే చెప్పేశాను.
ఫోన్‌లో ఎంతసేపు మాట్లాడుకునే వాళ్లు.
ఆది: రోజులో మూడు, నాలుగు గంటలు మాట్లాడుకున్నాం. అలా నాలుగు నెలలు గడిచింది.
అరుణ: ఆ తర్వాత పెళ్లైంది. మా ఇద్దరికీ గొడవ అయితే మొదట నేనే సారీ చెబుతా. తను మాత్రం తన తప్పు ఉంటేనే సారీ చెబుతాడు.. నేను అలా కాదు తప్పు ఎవరిదైనా సారీ చెప్పేస్తా..
మొదటి సారి గొడవ ఎప్పుడైంది?
ఆది: హనీమూన్ లోనే..
అరుణ: ఏం జరిగిందో గుర్తులేదు కానీ, గొడవ అయితే అక్కడే జరిగింది. అందుకే ఎప్పటికీ గుర్తుంటుంది. ఒక గంట తర్వాత మళ్లీ నార్మల్‌గా మాట్లాడేసుకున్నాం.
మీ ఇద్దరిలో మొదటి గిఫ్ట్ ఎవరిచ్చారు?
అరుణ: ఆది అసలు గిఫ్ట్ ఇచ్చే టైప్ కాదు. కొనడని కాదుకానీ.. కొంచెం బద్ధకస్తుడు. నేను చాలా గిఫ్ట్‌లు ఇచ్చాను. వాచ్, ఫోన్, కళ్లజోడు.. ఇలా అన్నీ ఇచ్చాను. వాటిని కూడా పోగొట్టేస్తాడు.
ఆది: తనకు ఇష్టమైన కుక్కను కొనిచ్చాను. నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలనే దాని గురించి రీసెర్చ్ చేసి ఇస్తాను. అరుణకు ఏం ఇష్టమో వాళ్ల చెల్లిని కనుక్కొని మరీ ఇస్తాను. ఒక బ్యాగ్ ఇచ్చాను.
సినిమాల విషయంలో ఏదైనా నిబంధన పెట్టారా?
ఆది: ఆ విషయంలో ఎప్పుడూ క్లారిటీగానే ఉంటాం. కాకపోతే ఒక కండీషన్ పెట్టింది. అనవసరంగా లిప్‌లాక్ ఇవ్వకు అని చెప్పింది.
అరుణ: ఆది.. నిజంగా బంగారం. నేను ఏది చెప్పినా దానికి వాల్యూ ఇస్తాడు.
పెళ్లి అయ్యాక ఇష్టాయిష్టాలు ఏమైనా మారాయా?
ఆది: అంతకు ముందు నాకు మా అమ్మచేతి కాఫీ తాగడం అలవాటు. ఇప్పుడు మాత్రం అరుణ ఇస్తేనే తాగాలనిపిస్తోంది.
అరుణ: మరీ ఎక్కువ చెప్పేయకు (నవ్వులు).
సర్‌ప్రైజ్‌లు ఎక్కువగా ఎవరు ప్లాన్ చేస్తారు? ఇద్దరిలో ఎవరు ఆధిపత్యం చేస్తారు?
అరుణ: సర్‌ప్రైజ్‌లు ఎక్కువగా ఇచ్చేది నేనే. నాకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇష్టం చాలా సార్లు అడిగాను. కానీ, ఆయనకు కుదరలేదు. అందుకే నేనే ఆది పేరు మీద బుక్ చేసి.. సర్‌ప్రైజ్ అయ్యాను.
ఆది: ఎవరం ఎవరిమీద ఆధిపత్యం చెలాయించము. నేను అబద్ధాలు చెబుతాను. అన్నీ తన వరకు తీసుకెళ్లడం నాకు ఇష్టముండదు. అందుకే అప్పుడప్పుడు అలా చెబుతుంటాను. తను టెన్షన్ పడడం ఎందుకని కొన్ని దాచేస్తాను. (వెన్నెల కిశోర్ (నవ్వుతూ): అన్నింటినీ దిగమింగుకుంటావన్న మాట.. ఏం చేస్తాం భర్తల జీవితాలు అంతే..)
మీరెప్పుడైనా మీ మొబైల్ పాస్‌వర్డ్ తప్పు చెప్పారా?
అరుణ: అసలు పాస్ వర్డ్ చెప్పరు. ఒక వేళ చెప్పినా.. వెంటనే లాక్ మార్చేస్తారు.
ఆది: ఫోన్ అనేది చాలా పర్సనల్ కదా.. అందుకే ఇవ్వను (నవ్వులు).
వెన్నెల కిషోర్: ఇస్తే అసలు ఏం చూడరు. ఇవ్వకపోతేనే అన్ని చూడాలనిపిస్తుంది.
మీరు వచ్చే సరికి మీ వైఫ్ నిద్రపోతే బాగుండని ఎప్పుడైనా అనుకున్నారా?
ఆది: అప్పుడప్పుడు అనుకుంటాను. లేట్ నైట్ ఇంటికి వస్తే నేను ఇంటికి వెళ్లే సరికి తను నిద్రపోతే బాగుండని అనుకుంటూ వస్తాను. పార్టీ నుంచి మనం ఇంటికి ఎలా వస్తామో తెలుసు కదా..(నవ్వులు)
అరుణ: ఇలా చాలా తక్కువ సార్లు జరిగింది.
వెన్నెల కిషోర్ వీరితో సరదాగా ఆడించిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్, ఏడడుగుల ముచ్చట్లు.. వీటన్నింటితో వినోదంగా సాగిన ఆది, అరుణల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌ను ‘ఈటీవీ విన్’ యాప్‌లో వీక్షించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్