ఆ హీరోతో ముద్దు సీన్స్‌.. చాలా ఇబ్బందిపడ్డా: బాలీవుడ్‌ నటి

తొలి చిత్రంలోనే ముద్దు సీన్స్‌లో నటించడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని ఓ బాలీవుడ్‌ నటి అన్నారు. ఆ సమయంలో చిత్రబృందం తనకెంతో అండగా నిలిచిందన్నారు.

Published : 09 Dec 2023 15:44 IST

ముంబయి: ‘ఆషిక్‌ బనాయా ఆప్నే’తో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు నటి తనుశ్రీదత్తా (Tanushree Dutta). ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నటీనటులపై ముద్దు సన్నివేశాలు చిత్రీకరించడం అప్పట్లో బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. ఇమ్రాన్‌ హష్మీతో కలిసి ముద్దు సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడంపై తనుశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తాను ఎంతో ఇబ్బందిపడ్డానని చెప్పారు.

‘‘ఇమ్రాన్‌ హష్మీతో నేను దాదాపు మూడు చిత్రాల్లో నటించా. ‘ఆషిక్‌ బనాయా ఆప్నే’ మా కాంబోలో వచ్చిన తొలి చిత్రం. అందులో మా ఇద్దరిపై రొమాంటిక్‌ సీన్స్ చిత్రీకరించారు. ముద్దు సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఇబ్బందిపడ్డా. ఎందుకంటే, ఇమ్రాన్‌ను నేను మొదటి నుంచి ఒక నటుడిగానే చూశా. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఆయనతో కిస్‌ సీన్స్‌ అనగానే కంగారుగా అనిపించింది. కాకపోతే టీమ్‌ అందరూ సపోర్ట్‌ చేయడంతో నటించగలిగాను. ‘చాక్లెట్‌’ మూవీలోనూ మా ఇద్దరిపై ముద్దు సీన్స్‌ చిత్రీకరించారు. కాకపోతే ఎడిటింగ్‌లో తీసేశారు. ఆరోజుల్లో ఇమ్రాన్‌కు బాలీవుడ్‌లో కిస్సర్‌ - బాయ్‌ ఇమేజ్‌ ఉండేది. నాకు తెలిసినంత వరకూ ఆయన అలాంటి వ్యక్తి కాదు. ముద్దు సన్నివేశాల్లో యాక్ట్‌ చేయడానికి ఆయన కూడా ఎంతో ఇబ్బందిపడతారు’’ అని ఆమె చెప్పారు.

Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్‌ రెడ్డి వంగా

2003లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’గా కిరీటాన్ని కైవసం చేసుకున్న తనుశ్రీ.. విశ్వ సుందరి పోటీల్లోనూ పాల్గొన్నారు. 2005లో ‘ఆషిక్‌ బనాయా ఆప్నే’తో నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారామె. దాదాపు ఎనిమిదేళ్ల కెరీర్‌లో బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ‘వీరభద్ర’ అనే తెలుగు చిత్రంలోనూ ఆమె నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని