Tasty Teja: మా బంధం అదే.. ఆమె వల్లే నా బిగ్‌బాస్‌ జర్నీ బ్యూటిఫుల్‌..!: టేస్టీ తేజ

tasty teja: బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తేజ తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

Published : 07 Nov 2023 01:43 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో (bigg boss telugu) మూడు వారాలు ఉంటే చాలని అనుకున్న తాను 60 రోజులకు పైగా ఉండటం ఆడియెన్స్‌ వల్లే సాధ్యమైందని టేస్టీ తేజ (tasty teja) అన్నాడు. 9వ వారం బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన అతను అనేక విషయాలను పంచుకున్నాడు. శోభతో తనకున్న రిలేషన్‌.. సందీప్‌ మాస్టర్‌ ఎలిమినేషన్‌ విషయంలో జరిగిన చర్చ ఇలా పలు విషయాలను వివరంగా చెప్పాడు.

వాళ్లతో వీడియోలు చేద్దామనుకున్నా!

‘‘నేను ఊహించినట్లే ఎలిమినేషన్‌ జరిగింది. 7, 9, 12, ఈ మూడు వారాలు దాటితే, చివరి వరకూ ఉంటానన్న నమ్మకం ఉంది. ఒకవేళ అయితే మాత్రం ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారం ఎలిమినేట్‌ అవుతానని అనుకున్నా. అనుకున్నట్లుగానే 9వ వారం ఎలిమినేట్‌ అయ్యా. అసలు బిగ్‌బాస్‌ ట్రోఫీ అనేది నా మనసులో లేదు. హౌస్‌లో వెళ్లేటప్పుడు మా అమ్మ ఒక్కటే చెప్పింది. ‘కొన్న బట్టలన్నీ కచ్చితంగా వేసుకోవాలి’ అన్నది.  నెల రోజులు ఉంటే సక్సెస్‌ అనుకున్నా. అలాంటిది రెండు నెలలపైనే ఉన్నా. బిగ్‌బాస్‌ ఒక గొప్ప ఫ్లాట్‌ఫాం. నాలాంటి వాడికి  అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. ఒకవేళ దొరికినా రెండు, మూడు వారాలకు వచ్చేస్తానేమో అనుకునేవాడిని. నాకు మరో ఆలోచన కూడా ఉంది. హౌస్‌లో ఉన్నవాళ్లతో పరిచయం పెంచుకుని, బయటకు రాగానే వాళ్లతో ఫుడ్‌ వ్లాగ్‌ వీడియో చేసుకుందామని అనుకున్నా.  అలా ఎంటర్‌ అయిన నేను 9వారాలు ఇంట్లో ఉన్నానంటే ఆడియెన్స్‌ వల్లే.  గేమ్స్‌ విషయానికొస్తే, నా శక్తిమేరకు ఆడా. (tasty teja interview) ఈ ఒళ్లు వేసుకుని ఆడటం కష్టమే. ఈ వారం నా ఆటతీరు చూసి, నాగార్జున గారు నా ఫొటోను బంగారంలో పెట్టారు. 60 రోజుల్లో 25 టాస్క్‌లు పెట్టినా, అందులో కొన్ని గ్రూప్‌ టాస్క్‌లు కూడా  ఉన్నాయి. మూడు సార్లు కెప్టెన్‌ కంటెండర్‌ అయ్యా’’

ఎన్ని పంచ్‌లు వేసినా సరదాగా తీసుకుంటుంది!

‘‘నాకూ శోభకు మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్‌ లేదు.  ఈ 63 రోజుల్లో హౌస్‌లో ఉన్నవాళ్లందరూ ఎన్ని గొడవలు పడ్డారో మా ఇద్దరి మధ్య అంతకన్నా ఎక్కువ గొడవలు జరిగాయి.  శోభాశెట్టి సెలబ్రిటీగా బయట తెలుసు.  హౌస్‌లోకి వెళ్లిన కొత్తలో నేనూ తనని అలాగే చూశా. తనే నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. రెండు, మూడు రోజులకే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. బయట చూసిన అమ్మాయికీ, నేరుగా కలిసి మాట్లాడిన శోభకు చాలా తేడా ఉంది. నేను ఎన్ని పంచ్‌లు వేసినా సరదాగా తీసుకుంటుంది. శోభా కెప్టెన్‌ కావడానికి నేనే కారణం అని నేను అనలేదు. ‘నేను గట్టిగా అడిగి ఉంటే అమర్‌ నాకు ఆడేవాడు’ అని నేను అనడంతో ఆ వివాదం వచ్చింది.  ఆటపరంగా నాకంటే శోభా మంచి ప్లేయర్‌.  వంట చేస్తున్న సమయంలో మా మధ్య టాటూల చర్చ వచ్చింది. అప్పుడు నేను ‘కావాలంటే నీ పేరు (శోభ) గుండెలపై వేయించుకుంటా’ అన్నాను. అక్కడ బిగ్‌బాస్‌ పట్టుకున్నాడు. అప్పటి నుంచి శోభా పేరును టాటూ వేయించుకోమన్నాడు. మేమిద్దరం మంచి స్నేహితులం’’

పూజతో గొడవ అదే!

‘‘నాతో పాటు హౌస్‌లో ఉన్నవాళ్లందరూ ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించారు. అన్ని సార్లు ఒకేరకంగా చేస్తే నవ్వు రాదు. నేను నామినేట్‌ చేయడం వల్లే నలుగురు బయటకు వెళ్లారనడం సరికాదు.  నామినేషన్స్‌ అంటే ఎందుకు భయమంటే, రెండు వారాలు కూడా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తానేమోనని భయం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిన వాళ్లనే నేను నామినేట్‌ చేశా.  పూజా విషయంలో జరిగిన గొడవ ఏంటంటే, నాగార్జునగారు చేసిన సూచన మేరకు కెప్టెన్‌ ఆమెకు చెప్పిన పనులన్నీ నన్ను చేయమని చెప్పింది. ‘ఒక రోజంతా నాకు పనిష్మెంట్‌ ఇవ్వమని చెప్పారు. అందుకు మీకు హక్కు ఉంది. ఐదు రోజులు చేయడం కుదరదని చెప్పా’ అక్కడ మా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నేనే ఆమె దగ్గరకు వెళ్లి ‘ఎన్ని రోజులైనా మీరు చెప్పింది చేస్తా’ అని చెప్పాను’’

అవన్నీ ఫన్నీ సంభాషణలు..

‘‘ఇక సందీప్‌ మాస్టర్‌ స్వయంగా ఆయనను నామినేట్‌ చేయమని నాతో చెప్పలేదు. ఓ సందర్భంలో మా ఇద్దరి మధ్యా జరిగిన చర్చ ఏంటంటే. ‘నామినేషన్స్‌ లేకుండా ఏడెనిమిది వారాలు కొనసాగాం. సడెన్‌గా నామినేషన్‌లోకి వస్తే, మనకున్న ఫ్యాన్‌ బేస్‌ ఓటింగ్‌గా మారడం కష్టం. ఒకవేళ 11, 12 వారాలకు వెళ్తే, అప్పుడు నామినేషన్స్‌లో ఉంటే వెళ్లిపోవడం ఖాయం. అందుకే ఇప్పుడు నామినేషన్స్‌కు వెళ్తే బెటర్‌’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అవన్నీ మా మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలు.  ముందుగా చర్చించుకుని ఎవరి మీదా నామినేషన్స్‌ వేయలేదు’’

  • సీజన్‌-7లో ఎవరు ఎలాంటి వారంటే..??
  • రతిక: బిగ్‌బాస్‌లోకి అవకాశం రావడమే గొప్ప. రెండోసారి కూడా నాగార్జున సర్‌ని అవకాశం ఇవ్వమని అడిగింది. నిలబెట్టుకుంటే మంచిది.
  • భోలే షావలి: తాను అనుకున్నదే నిజం అనుకుంటాడు. పాజిటివ్‌ పర్సన్‌.
  • శివాజీ: నన్ను ఏమైనా అన్నా కూడా ఆటపరంగానే అన్నారు. మీకు వీడియోలో చూపించింది కొంతే. నన్ను పొరపాటుగా అన్నా కూడా ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆ విషయాలేవీ మీకు తెలియవు.
  • గౌతమ్‌: ఆలోచన ఎక్కువ. అది తగ్గిస్తే, టాప్‌-5కు వెళ్లే అవకాశం ఉంది.
  • అశ్విని: ఆటపరంగా బాగానే ఉంటుంది కానీ, మాట పరంగా అర్థం చేసుకోవాలి.
  • ప్రియాంక: ఇంట్లో ఉన్న అందరినీ రావే, పోవే అని పిలుస్తా. కానీ, ఆమెను అలా పిలవలేదు. మంచి అమ్మాయి.
  • అమర్‌: మంచి పరిణతి ఉన్న వ్యక్తి. విశ్లేషణ బాగా చేస్తాడు. ఒక సోదరుడిగా దగ్గరయ్యాడు.
  • శోభ: నా బిగ్‌బాస్‌ జర్నీ బ్యూటిఫుల్‌గా ఉందంటే శోభానే.
  • ప్రశాంత్‌: ఓటమిని తీసుకోలేడు.
  • యావర్‌: మంచి స్నేహితుడు
  • అర్జున్‌: వైల్డ్‌ కార్డు ఎంట్రీల్లో వచ్చిన వాళ్లలో కనెక్ట్‌ అయిన వ్యక్తి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని