Akshay Kumar: అక్షయ్.. ‘ఓఎమ్‌జి 2’
అరడజనుకు పైగా చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ఇప్పుడాయన జాబితాలో మరో కొత్త చిత్రం చేరింది. అదే ‘ఓఎమ్‌జి 2’ (ఓ మై గాడ్ 2). ఈ సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
అరడజనుకు పైగా చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ఇప్పుడాయన జాబితాలో మరో కొత్త చిత్రం చేరింది. అదే ‘ఓఎమ్‌జి 2’ (ఓ మై గాడ్ 2). ఈ సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో అక్షయ్ శివుడి అవతారంలో ఉన్నట్లు కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో ఓ స్కూల్ పిల్లాడిని కూడా చూడొచ్చు. 2012లో విడుదలై విజయాన్ని అందుకున్న ‘ఓ మై గాడ్’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. తొలి భాగంలో ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే కథాంశాన్ని ఎంచుకోగా.. ఇందులో మరో కొత్త కాన్సెప్ట్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమిత్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వకూ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అక్షయ్ - పరేశ్ రావెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ మై గాడ్’ను తెలుగులో ‘గోపాల గోపాల’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్, పవన్ కల్యాణ్ కథానాయకులుగా నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్