Bangarraju: ‘బంగార్రాజు’ బాజా

‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో  బంగార్రాజుగా సందడి చేసి.. సినీ ప్రియుల్ని మెప్పించారు కథానాయకుడు నాగార్జున. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రతో వినోదాలు పంచేందుకు ‘బంగార్రాజు’తో సిద్ధమవుతున్నారు. ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది.

Updated : 29 Jun 2023 17:04 IST

‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో  బంగార్రాజుగా సందడి చేసి.. సినీ ప్రియుల్ని మెప్పించారు కథానాయకుడు నాగార్జున. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రతో వినోదాలు పంచేందుకు ‘బంగార్రాజు’తో సిద్ధమవుతున్నారు. ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ  స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగచైతన్య మరో హీరో. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటి   స్తుండగా.. నాగ్‌ సరసన రమ్యకృష్ణ కనిపిస్తుంది. ఈ సినిమాలోని ‘‘లడ్డుండా..’’ అనే తొలి గీతాన్ని ఈనెల 9న ఉదయం 9:09  గంటలకు విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. యువరాజ్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని