Romantic: ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి..

రొమాంటిక్‌’ భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు తప్పక కనెక్ట్‌  అవుతార’’న్నారు సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. ఇప్పుడాయన స్వరాలందించిన చిత్రం ‘రొమాంటిక్‌’. ఆకాష్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించారు.

Updated : 26 Oct 2021 07:18 IST

‘‘రొమాంటిక్‌’ భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు తప్పక కనెక్ట్‌  అవుతార’’న్నారు సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. ఇప్పుడాయన స్వరాలందించిన చిత్రం ‘రొమాంటిక్‌’. ఆకాష్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్‌ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్‌, ఛార్మినిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారుసునీల్‌  కశ్యప్‌.

‘‘నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. అందమైన ప్రేమ కథతో రూపొందింది. సినిమాలో చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. ముఖ్యంగా ద్వితియార్థం చాలా భావోద్వేగభరితంగా సాగుతుంది. పూరి సర్‌ మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్‌ అవ్వరు. అలాంటిది ఈ సినిమా చూశాక.. ఆయన కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అది చూశాక సినిమాపైనా.. నా పని పట్ల నమ్మకం వచ్చింది’’.

* ‘‘కథ విన్నప్పటి నుంచి.. ‘రొమాంటిక్‌’ అని టైటిల్‌ పెట్టినప్పటి నుంచి నేను కూడా రొమాంటిక్‌ అయిపోయి పాటలు కంపోజ్‌ చేశాను. మా ‘ఇస్మార్ట్‌’ గ్యాంగ్‌ అంతా అలా కూర్చొని సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్‌’. అది అందరికీ చాలా నచ్చేసింది. ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా ఓ పాట పాడింది’’.

* ‘‘సినిమాలతో పాటు క్లాసికల్‌ సంగీతం వైపు వెళ్లాలనుకుంటున్నా. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్‌  వేరియేషన్స్‌, క్లాసికల్‌ ఫ్యూజన్స్‌ రావొచ్చు. ప్రస్తుతం సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’కి స్వరాలందిస్తున్నా. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని