Mahesh Babu: చక్రసిద్ధ కేంద్రాన్ని ప్రారంభించిన మహేశ్‌ దంపతులు

ప్రాచీనమైన  వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగేశారు మహేశ్‌ బాబు, నమత్ర శిరోద్కర్‌. ఈ మేరకు శంకర్‌పల్లి సమీపాన ఉన్న మోకిలలో ‘చక్రసిద్ధ‌’ పేరిట ఓ చికిత్సాలయాన్ని నెలకొల్పారు.

Published : 11 Aug 2021 23:25 IST

హైదరాబాద్‌‌: ప్రాచీనమైన వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగేశారు మహేశ్‌ బాబు, నమత్ర శిరోద్కర్‌. ఈ మేరకు ‘చక్రసిద్ధ‌’ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్‌ని ఆయన ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడారు. ‘ప్రాచీనమైన సిద్ధ వైద్యాన్ని అందించే కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సిద్ధ వైద్యం.. ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్దతి మాత్రమే కాదు, మన జీవనశైలినీ మార్చడంలో సహాయపడుతుంది. ఇక్కడి వైద్యురాలు సింధుజ చెప్పిన పద్ధతులు పాటిస్తే మనం అద్భుతాలని చూడొచ్చు. మన జీవనశైలిని పూర్తిగా మార్చుకోవచ్చు’ అని తెలిపారు. ఎన్నో రకాల వ్యాధులకు, ఎక్కడా నయంకాని వ్యాధులకు సులువైన పద్ధతుల్లో ఇక్కడ చికిత్స చేయనున్నారు.

సినిమా విషయానికొస్తే.. ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నారు మహేశ్‌ బాబు. పరశురామ్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నాయిక. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు మహేశ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని