God Father: చిరు చెల్లిగా నయన్‌.. అంత డబ్బు తీసుకుంటుందా?

అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామా ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో...

Published : 20 Nov 2021 01:12 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామా ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే హీరో సోదరి పాత్రను తెలుగులో నయనతార పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా కోసం నయన్‌ తీసుకున్న పారితోషికంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుందట. మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారట.

ఇక, సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్‌ ఈ సినిమాలో ఓ కీ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని