Puneet Rajkumar: పునీత్‌ను కలుద్దామనుకున్నా.. కానీ ఇంతలోనే: పూరి జగన్నాథ్
‘పునీత్ రాజ్‌కుమార్‌తో నెల క్రితం ఫోన్లో మాట్లాడాను. త్వరలోనే కలుద్దామనుకున్నాం. కానీ, ఇంతలోనే విషాదం జరిగింది’ అని ప్రముఖ దర్శకుడు భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘పునీత్ రాజ్‌కుమార్‌తో నెల క్రితం ఫోన్లో మాట్లాడా. త్వరలోనే కలుద్దామనుకున్నాం. కానీ, ఇంతలోనే విషాదం జరిగింది’ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘‘పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తను నాకెంతో క్లోజ్. హీరోగా తన తొలి చిత్రానికి నేను దర్శకత్వం వహించా. వారి కుటుంబం అంటే నాకు అభిమానం. పునీత్ చాలా మంచి మనిషి. ఎంతోమందికి సాయం చేశాడు. అలాంటి వ్యక్తి దూరమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. చిన్న వయసులో చనిపోవడాన్ని తట్టులేకపోతున్నా. నెల క్రితం మాట్లాడుకున్నాం. సరదాగా కలుద్దామనుకున్నాం. ఈలోపు ఇలా జరిగింది. పునీత్ మరణం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకే కాదు కన్నడ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. లవ్ యు పునీత్. ఐ మిస్ యు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
రాజ్‌కుమార్ కుటుంబంతో పూరి జగన్నాథ్ అనుబంధం..
ప్రముఖ నటుడు దివంగత రాజ్‌కుమార్ కుటుంబంతో పూరి జగన్నాథ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే కన్నడ దర్శకుల్ని కాదనుకుని పునీత్ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశాన్ని పూరి జగన్నాథ్‌కి ఇచ్చారు. జగపతిబాబు హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బాచి’ చిత్రం ఇక్కడ అనుకున్నంత విజయం అందుకోకపోయినా కన్నడనాట మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన రాజ్‌కుమార్ సభ్యుల్లో ఒకరు దర్శకుడి ప్రతిభ గురించి ఇంట్లో చర్చించారు. ఈ మాటలు విన్న రాజ్‌కుమార్ పూరి జగన్నాథ్‌ను తమ ఇంటికి ఆహ్వానించి, తన పెద్ద కుమారుడు శివ రాజ్‌కుమార్‌తో ఓ చిత్రం చేయాలని కోరారు. పూరి జగన్నాథ్ ‘నో’ చెప్పకుండా ‘యువరాజా’ అనే సినిమాని తెరకెక్కించారు. తెలుగులో విజయవంతమైన ‘తమ్ముడు’ రీమేక్‌గా రూపొందింది. సినిమా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ వేగం, నేర్పు రాజ్‌కుమార్‌కు అమితంగా నచ్చేశాయి.
తన మూడో కుమారుడు పునీత్‌ను హీరో చేయాలని రాజ్‌కుమార్ అనుకున్న సందర్భంలో.. అప్పటి కన్నడ పరిశ్రమకు చెందిన ఎంతోమంది దర్శకులు, రచయితలు ఆయనకు కథలు వినిపించారు. అవేవీ ఆయనకు నచ్చలేదు. ఫైనల్‌గా పూరి జగన్నాథ్‌ను పిలిచి విషయం చెప్పారు. అలా పూరి జగన్నాథ్ తాను రాసుకున్న కథ వినిపించగానే రాజ్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యులందరికీ నచ్చేసింది. ఆ కథే ‘అప్పూ’ టైటిల్‌తో పట్టాలెక్కింది. తక్కువ సమయంలోనే చిత్రీకరణ పూర్తయింది. విడుదలైన అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురిపించింది. ఇదే కథ రవితేజ హీరోగా తెలుగులో ‘ఇడియట్’ పేరుతో అలరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్