
Ranveer Singh: ‘83’ వరల్డ్ కప్.. కపిల్‌దేవ్ విజయ రహస్యాన్ని బయటపెట్టిన రణ్‌వీర్!
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ విజయ రహస్యాన్ని బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బయటపెట్టాడు. 1983లో భారత్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునేలా కపిల్‌దేవ్ తల్లి ఆయనలో స్ఫూర్తినింపారని తెలిపారు. కపిల్‌దేవ్ జీవితాధారంగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘83’. ఇందులో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ నటించారు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ 1983లో కపిల్‌దేవ్‌కి వాళ్లమ్మ చెప్పిన మాటల్ని రణ్‌వీర్ పంచుకున్నారు. ఆమె ఎప్పుడూ బెస్ట్ ఆఫ్ లక్ లాంటివి చెప్పేవారు కాదని, గెలిచిరా అంటూ కపిల్‌లో ఎంతో స్ఫూర్తినింపేవారని తెలిపారు. ఆ మాటే 1983లో భారత్‌కి వరల్డ్ కప్ తీసుకొచ్చేలా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. కపిల్‌దేవ్ భార్యగా రణ్‌వీర్ సరసన దీపికా పదుకొణె నటించారు. తాహీర్ రాజ్ భాసిన్, జీవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు. ఈ సినిమా 3డీ వెర్షన్‌లోనూ సందడి చేయనుంది. ట్రైలర్ నవంబరు 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
► Read latest Cinema News and Telugu News