Katrina kaif: పెళ్లి విషయం లీక్‌.. బాధలో కత్రినాకైఫ్‌

బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌.. నటుడు విక్కీకౌశల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, పెళ్లి విషయాన్ని ఈ జంట ఇప్పటివరకూ...

Published : 09 Nov 2021 18:10 IST

కత్రినా కోసం ఇల్లు అద్దెకు తీసుకున్న విక్కీ 

ముంబయి: బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌.. నటుడు విక్కీకౌశల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే, పెళ్లి విషయాన్ని ఈ జంట ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించనప్పటికీ పలు ఆంగ్ల పత్రికల్లో మాత్రం వరుస కథనాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి వివాహం జరగనుందంటూ అందరూ చెప్పుకొంటున్నారు. ఎంతో గోప్యంగా ఉంచినప్పటికీ పెళ్లి విషయం లీక్‌ కావడంపట్ల కత్రినా అసంతృప్తిగా ఉన్నారట. దీంతో విక్కీ-కత్రినా పెళ్లి వేదికను మార్చే అవకాశం ఉందని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఇప్పటివరకూ తమ స్నేహితులకు పెళ్లి ఆహ్వాన పత్రికలను కూడా పంపించలేదట. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కత్రినా వీలైనంత గోప్యంగా ఉంచుతారు. కుటుంబ విషయాలు, ఫ్రెండ్స్‌.. ఇలా ఎన్నో విషయాలను ఆమె బహిర్గతం చేయరు. ఈక్రమంలోనే విక్కీతో డేటింగ్‌, పెళ్లి విషయాన్ని కూడా ఆమె అధికారికంగా ప్రకటించలేదు.

కత్రినా కోసం ఇల్లు అద్దెకు తీసుకున్న విక్కీ..

తనకు కాబోయే శ్రీమతి కత్రినాకు విక్కీ ఓ ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. వివాహం జరిగిన తర్వాత తన భార్యతో కలిసి ఉండేందుకు వీలుగా ఓ విశాలవంతమైన ఇంటిని విక్కీ అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే ‘జుహు’లోని రాజ్‌మహల్‌లో విక్కీ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఐదు సంవత్సరాలపాటు అక్కడే ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ మేరకు అడ్వాన్స్‌గా రూ.1.78 కోట్లను విక్కీ చెల్లించారట. ఇక, ప్రతి నెలా రూ.8 లక్షలు అద్దె చెల్లించనున్నారని సమాచారం. అయితే కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని