keerthy Suresh: సఖి.. కళావతి

ఆకట్టుకునే అందం.. అంతే చక్కని అభినయంతో.. సినీ ప్రియుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్‌. వరస అవకాశాలతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా మెరుపులు   మెరిపిస్తోంది.

Updated : 18 Oct 2021 07:13 IST

ఆకట్టుకునే అందం.. అంతే చక్కని అభినయంతో.. సినీ ప్రియుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్‌. వరస అవకాశాలతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా మెరుపులు   మెరిపిస్తోంది. ఇప్పుడామె ‘సర్కారు వారి పాట’ కోసం కళావతిగా మారింది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పరుశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కీర్తి.. డెనిమ్‌ జాకెట్‌ ధరించి.. చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్‌గా కనిపించింది. ఈ లుక్‌ని పరశురామ్‌ తన ట్విటర్‌లో పంచుకుంటూ ‘‘అందం.. అభినయానికి ప్రతిరూపమైన ‘కళావతి’కి హ్యాపీ బర్త్‌డే’’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌, కీర్తిలతో పాటు ఇతర తారాగణమంతా పాల్గొంటోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


నవంబరులో సందడి..

కీర్తి సురేష్‌ టైటిల్‌ పాత్రలో నాగేశ్‌ కుకునూర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలో.. కీర్తి షూటర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ చిత్రం నుంచి ఆమె కొత్త లుక్‌ విడుదల చేసి, చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. సినిమాని నవంబరులో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు