Maayon: ‘కట్టప్ప’ తనయుడి ‘మాయోన్‌’.. ‘మాంపాహీ’ గీతం విన్నారా..!

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ (కట్టప్ప) తనయుడు శిబి సత్యరాజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాయోన్‌’.

Published : 13 Dec 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు సత్యరాజ్‌ (కట్టప్ప) తనయుడు శిబి సత్యరాజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాయోన్‌’. తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. కిశోర్‌ ఎన్‌. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మాంపాహీ’ అనే గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భాస్కరభట్ల రవికుమార్‌ రచించగా సైంధవి శ్రీవాత్సన్‌, వినయ కార్తీక్‌ రాజన్‌ ఆలపించారు. ఓ దేవాలయం, అందులోని గుప్తనిధుల చుట్టూ సాగే కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్‌ మొళి నిర్మిస్తూ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని