PSPKRanaMovie: పవన్‌-రానా చిత్రం.. టైటిల్‌ ఎప్పుడంటే?

పవన్‌ కల్యాణ్, రానా కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. మరో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం.

Published : 14 Aug 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్, రానా కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్‌ రచనా సహకారం అందిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఆగస్టు 15న ఉదయం 9:45గంటలకు ఈ చిత్ర టైటిల్‌, పవన్‌ కల్యాణ్‌ పాత్రకి సంబంధించి గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు దర్శక-నిర్మాతలు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ లుంగీ కట్టులో వెనక్కి తిరిగి కనిపించారు. ప్రీ లుక్‌తోనే ఆసక్తిని పెంచేస్తున్నారు. మరి ఈ సినిమా పేరేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌... భీమ్లానాయక్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన నిత్య మేనన్‌ నటిస్తుండగా రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని