
RRR: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్.. చరణ్, ఎన్టీఆర్ ‘నాటు’ డ్యాన్స్ అదిరింది!
ఇంటర్నెట్ డెస్క్: సంగీత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మాస్ ఆంథమ్ ‘నాటు నాటు’ (Naatu Naatu Song) వచ్చేసింది. రామ్ చరణ్ (Ramcharan), ఎన్టీఆర్ (NTR) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 (RRR release date)న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్ వీడియో)ను విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు...’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియా భట్, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రలు పోషించారు.
► Read latest Cinema News and Telugu News