Wow: ‘అలా మొదలైంది’.. వీరి ‘ప్రయాణం’

బుల్లి తెర ప్రేక్షకులకి వినోదంతోపాటు విజ్ఞానం అందిస్తున్న కార్యక్రమం ‘వావ్‌ 3’. సాయి కుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్‌లో కల్పిక, స్నిగ్ధ, రాకేందు మౌళి, ఆర్జే సమీర్‌ సందడి చేయనున్నారు. దీనికి

Published : 26 Aug 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లి తెర ప్రేక్షకులకి వినోదంతోపాటు విజ్ఞానం అందిస్తున్న కార్యక్రమం ‘వావ్‌ 3’. సాయి కుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్‌లో కల్పిక, స్నిగ్ధ, రాకేందు మౌళి, ఆర్జే సమీర్‌ సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వీడియో ఆద్యంతం సరదాగా సాగింది. సినీ పరిశ్రమలో తమ ప్రయాణం ఎలా మొదలైందో తెలిపారు. ‘అలా మొదలైంది’ సినిమాతో తన కెరీర్‌ మొదలైందని స్నిగ్ధ, ‘ప్రయాణం’ చిత్రంతో తన ప్రయాణం ప్రారంభమైందని కల్పిక తెలిపారు. సమీర్‌.. సాయి కుమార్‌ వాయిస్‌ మిమిక్రీ చేసి, అలరించాడు. సాయి కుమార్‌ అడిగిన ప్రశ్నలకు చిలిపి సమాధానం చెప్తూ అందరూ నవ్వులు పంచారు. ఈ హంగామాని చూడాలంటే ఆగస్టు 31 వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు