Tillu Square: నా కొంపెట్లా ముంచనున్నావో చెప్పు రాధికా..

‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రలో ‘టిల్లు స్క్వేర్‌’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 28 Nov 2023 09:33 IST

‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రలో ‘టిల్లు స్క్వేర్‌’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. సోమవారం ఈ సినిమాలోని రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘రాధిక.. రాధిక.. ముందుకా.. వెనకకా.. కిందికా.. మీదికా.. ముంచకా.. తేల్చకా ఆటలేందే ఇక’’ అంటూ సాగుతున్న ఈ పాటకు రామ్‌ మిరియాల స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ‘‘చెప్పు రాధిక ఏం కావాల నీకు.. నేను నీకెలా సహాయపడగలతాను.. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావో చెప్పు రాధిక’’ అంటూ పాట ఆరంభంలో అనుపమతో సిద్ధు చెప్పే డైలాగ్‌ వినోదాత్మకంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు