డ్యాన్స్‌తో ఫిదా చేస్తోన్న రష్మిక

‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఓకే చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్‌...

Updated : 12 Feb 2021 13:55 IST

బ్యూటీ ఫస్ట్‌ ఆల్బమ్‌ వచ్చేసింది

ముంబయి: ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఓకే చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్‌ ప్రేక్షకుల మది దోచేయడం కోసం రష్మిక ఓ హిందీ ఆల్బమ్‌లో భాగమయ్యారు. ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా, రష్మిక కలిసి.. ‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు