Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు జోడీగా త్రిప్తి డిమ్రి..?

బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. టాలీవుడ్‌లో సూపర్‌ ఆఫర్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Published : 20 Jan 2024 13:51 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా గతేడాది ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు జరిగినట్టు ఇప్పటికే చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు.. శ్రీలీల స్థానంలో బాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ త్రిప్తి డిమ్రిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం ఇప్పటికే సంప్రదింపులు జరపగా.. ఆమె పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణీ వసంత్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కథనాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Sonu sood: డీప్‌ ఫేక్‌ బారిన సోనూసూద్‌.. జాగ్రత్తగా ఉండాలని కోరిన నటుడు..

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 12వ చిత్రమిది. VD12గా ఇది ప్రచారంలో ఉంది. స్పై థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. మార్చి నుంచి రెగ్యులర్‌ షూట్‌ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన త్రిప్తి డిమ్రి.. ‘యానిమల్‌’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో త్రిప్తి యువ హృదయాలను కొల్లగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు