Tulasivanam: మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘తులసీవనం’

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో అక్షయ్‌ లగుసాని, ఐశ్వర్య, వెంకటేశ్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తులసీవనం’. అనిల్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ‘ఈటీవీ విన్‌’ ఓటీటీ వేదికగా ఈ నెల 21నుంచి ప్రసారం కానుంది.

Updated : 17 Mar 2024 11:29 IST

ఈటీవీ విన్‌లో ఈ నెల 21న విడుదల

 దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో అక్షయ్‌ లగుసాని, ఐశ్వర్య, వెంకటేశ్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తులసీవనం’. అనిల్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ‘ఈటీవీ విన్‌’ ఓటీటీ వేదికగా ఈ నెల 21నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, ఈ చిత్ర సమర్పకుడు తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌కు సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్‌ దృష్ట్యా కొన్ని భయాలు ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్‌ చేయడం వెనుక అందరి కృషి ఉంటుంది. ఈ ‘తులసీవనం’ కథలో చాలా స్పష్టత ఉంది. అనిల్‌ దీన్ని నిజాయతీగా తీయడం ఒకెత్తైతే దాన్ని ఈటీవీ విన్‌ ప్రోత్సహించడం మరో గొప్ప విషయం. వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నప్పుడు తెలుగులోనూ టికెట్లు తెగుతున్నాయి. కథలు బాగా చెప్తున్నారనే బ్రాండ్‌ ఆ పరిశ్రమలకు క్రియేట్‌ అయింది. తెలుగులో దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలనేది నా కోరిక. ఇందులో ఈటీవీ విన్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నా. దీనికోసమే ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రం. అందరూ రిలేట్‌ చేసుకునే కథగా ఉంటుంది. స్మరన్‌ అద్భుతమైన సంగీతంతో ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ప్రేమ్‌ సాగర్‌ చక్కటి విజువల్స్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో నితిన్‌ చక్రవర్తి, అక్షయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని