Telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
Telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కారణంగా వాయిదా పడిన పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ వద్దకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూసేయండి
ఎవరికీ తలవంచను అంటున్న సూర్య
‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య(Suriya). ఇప్పుడు ‘ఈటి’(ET)తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటిస్తోంది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని’, ‘అమ్మాయిలు అంటే బలహీనులు అనుకుంటారు. బలవంతులు అని నిరూపించాలి’ వంటి డైలాగ్‌లు అలరిస్తున్నాయి. ఎవరికి జరిగిన అన్యాయం కోసం సూర్య పోరాటం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తెలియాలంటే ‘ఈటీ’ చూడాల్సిందే!
విక్రమాదిత్య-ప్రేరణల ప్రేమ కావ్యం ‘రాధేశ్యామ్’
విధితో పోరాటం చేసిన ఓ జంట ప్రేమకథ ఎలాంటిదో తెలియాలంటే తమ సినిమా చూడాల్సిందే అంటున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్(Prabhas). రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’(Radhe Shyam). పూజాహెగ్డే(Pooja Hegde) కథానాయిక. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకులు. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు మార్చి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరులో ఏది గెలిచిందన్న ఆసక్తికరం. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు/సిరీస్‌లు
నేరుగా ఓటీటీలోకి వస్తున్న ‘మారన్’
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్(Dhanush) ఇప్పుడు ‘మారన్’(Maaran) చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్(Malavika Mohanan) కథానాయిక. డిస్నీ హాట్‌స్టార్‌లో మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ధనుష్ జర్నలిస్టుగా కనిపించనున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఆది ‘క్లాప్’
ఇటీవల కాలంలో క్రీడా నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు తరచూ బాక్సాఫీస్‌ను పలకరిస్తున్నాయి. అలా ఆది పినిశెట్టి కథానాయకుడిగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’(CLAP). ఆకాంక్షసింగ్ నాయిక. రామాంజనేయులు జవ్వాజి, ఎమ్.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 11 ప్రముఖ ఓటీటీ సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఆది పినిశెట్టి ఇందులో అథ్లెట్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: ప్రవీణకుమార్, మాటలు: వనమాలి
ఓటీటీలో రవితేజ ‘ఖిలాడీ’
రవితేజ(Ravi teja) కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడీ’(Khiladi). డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా మార్చి 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్
* అప్లోడ్ (వెబ్‌సిరీస్-2) మార్చి11
నెట్‌ఫ్లిక్స్
* అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్-6) మార్చి 07
* ద ఆండీ వార్హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) మార్చి 09
* ద లాస్ట్ కింగ్డమ్ (వెబ్‌సిరీస్-5) మార్చి 09
* ఆ ఆడమ్ ప్రాజెక్టు (హాలీవుడ్)మార్చి11
జీ5
* మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (హిందీ సిరీస్) మార్చి11
* రైడర్ (తెలుగు, కన్నడ) మార్చి11
* రౌడీ బాయ్స్(తెలుగు) మార్చి11
ఆహా
* ఖుబూల్ హై (తెలుగు సిరీస్) మార్చి11
ఎంఎక్స్ ప్లేయర్
* అనామిక (హిందీ) మార్చి 10
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్‌లో జరిగే కథ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!