Telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
telugu movies: ఈ వారం థియేటర్లో సందడి చేయబోయే చిన్న సినిమాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: వరుసగా భారీ సినిమాలు విడుదలవుతుండటంతో చిన్న సినిమాలన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు మే మొదటివారంలో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వస్తున్నాయి.
మరోసారి వైవిధ్యమైన కథతో శ్రీవిష్ణు
శ్రీవిష్ణు(sri vishnu) కథానాయకుడిగా వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన సినిమా‘భళా తందనాన’(Bhala thandanana). కేథరిన్(Catherine)కథానాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి నిర్మాత. సాయి కొర్రపాటి సమర్పకులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. వాణిజ్యాంశాలతో అందరికీ వినోదాన్ని పంచుతుంది’ అని సినీ వర్గాలు తెలిపాయి. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
జయమ్మ పంచాయతీ ఏంటి?
తన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటి సుమ(Suma). అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరిసినా, పూర్తిస్థాయి పాత్రను ఇప్పటివరకూ పోషించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’(Jayamma panchayathi). విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ.. దేనికీ లొంగని నిస్వార్థపూరితమైన పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. దినేష్, షాలిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.
అర్జున్ పెళ్లి అయిందా?
విశ్వక్సేన్(vishwak sen), రుక్సార్ థిల్లాన్(Rukshar Dhillon) జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’(Ashoka Vanamlo Arjuna Kalyanam). ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మే 6వ తేదీనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు. పెళ్లి చూపులకని గోదావరి జిల్లాలోని ఓ ఊరికి వెళ్లి 33ఏళ్ల అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆడ పెళ్లి వాళ్ల నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి? అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు
వైలెంట్ పాత్రలో కీర్తి సురేశ్!
కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న కీర్తి సురేశ్(Keerthy suresh) ఇప్పుడు ఓ విభిన్న పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సెల్వరాఘవన్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘చిన్ని’(Chinni). అరుణ్ మథేశ్వరం దర్శకుడు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంతకీ రంగయ్యకు, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్ప్రైమ్ వీడియో వేదికగా ‘చిన్ని’ స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్
* ద వైల్డ్స్(వెబ్ సిరీస్2) మే 6
* మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ) మే5
నెట్‌ఫ్లిక్స్
* రాధేశ్యామ్(హిందీ) మే 4
* 40 ఇయర్స్ యంగ్ (హాలీవుడ్) మే4
* థార్(హిందీ) మే 6
* ఎలోన్ ఫర్ ది రైడ్
* ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్ సిరీస్)మే6
జీ5
* ఝుండ్ (హిందీ)మే6
డిస్నీ + హాట్‌స్టార్
* హోమ్ శాంతి(హిందీ సిరీస్) మే6
* స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్) మే6
సోనీ లివ్
* పెట్ పురాణ్(తెలుగు) మే6
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్‌కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు