JanaGanaMana: ‘జనగణమన’.. ఆరంభం

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘లైగర్‌’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పుడీ కలయికలోనే ‘జేజీఎం (జనగణమన)’ అనే మరో పాన్‌ ఇండియా సినిమా

Updated : 05 Jun 2022 07:35 IST

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ‘లైగర్‌’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పుడీ కలయికలోనే ‘జేజీఎం (జనగణమన)’ అనే మరో పాన్‌ ఇండియా సినిమా పట్టాలెక్కబోతోంది. దీన్ని ఛార్మి కౌర్‌, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ శనివారం ముంబయిలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఫొటోతో పాటు చిన్న వీడియోను నెట్టింట పంచుకున్నారు. ‘‘పూరి జగన్నాథ్‌ కలల సినిమా ఇది. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ముంబయితో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుకోనుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని