Vijay Deverakonda: గ్యాంగ్‌స్టర్‌గా విజయ్‌ దేవరకొండ?

విజయ్‌ దేవరకొండ సినిమాల విషయంలో వేగం పెంచారు. ప్రస్తుతం ఓ వైపు పరశురామ్‌తో ఓ చిత్రం చేస్తూనే.. మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నారు.

Updated : 13 Oct 2023 12:18 IST

విజయ్‌ దేవరకొండ సినిమాల విషయంలో వేగం పెంచారు. ప్రస్తుతం ఓ వైపు పరశురామ్‌తో ఓ చిత్రం చేస్తూనే.. మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండూ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. వీటి తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ చేయనున్నారు. దీన్ని రవికిరణ్‌ కోలా తెరకెక్కించనున్నారు. 1980ల నేపథ్యంలో సాగే మాఫియా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో టైటిల్‌తో పాటు మిగతా వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని