Vishal: విశాల్‌ కొత్త ప్రయాణం

ఇప్పటిదాకా నటనతో అలరించిన సీనియర్‌ నటుడు విశాల్‌.. దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఆయన నటించిన ‘డిటెక్టివ్‌’ మంచి విజయాన్ని అందుకుంది.

Updated : 18 Mar 2024 11:15 IST

ప్పటిదాకా నటనతో అలరించిన సీనియర్‌ నటుడు విశాల్‌.. దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఆయన నటించిన ‘డిటెక్టివ్‌’ మంచి విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా ‘డిటెక్టివ్‌ 2’ రాబోతున్నట్లు తెలుపుతూ.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నట్టు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘‘25 ఏళ్ల తరవాత నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది. నా కల, కోరిక..జీవితంలో నేను ఎలా ఉండాలని మొదట్లో అనుకున్నానో అది నిజం కాబోతుంది. నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిటెక్టివ్‌ 2’ ప్రాజెక్టు కోసం లండన్‌ బయలు దేరాం. నటుడిగా నాకు మంచి గుర్తింపు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా నా ప్రయత్నానికీ మీ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు విశాల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని