Money Heist: మనీ హెయిస్ట్‌ తెలుగులో తీస్తే.. ప్రొఫెసర్‌ ఎవరో తెలుసా?

‘మనీ హెయిస్ట్ తెలుగులో తీస్తే..’ అంటూ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రొఫెసర్‌గా దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌ కనిపించారు.

Published : 13 Sep 2021 20:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న వెబ్‌సిరీస్‌ ‘మనీ హెయిస్ట్‌’. లా కాసా డీ పాపెల్‌(ది హౌస్‌ ఆఫ్ పేపర్‌) పేరుతో స్పానిష్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ రెండు భాగాలుగా తెరకెక్కింది. రాయల్‌ మింట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగే కథలతో ఈ రెండు భాగాలు తెరకెక్కాయి. సెప్టెంబరు 3న విడుదలైన మొదటి భాగం అలరిస్తుండగా, రెండో భాగం డిసెంబరులో విడుదల కానుంది.

అయితే, యువత, హాలీవుడ్‌ సినిమాలను వీక్షించే వారికి ఇలాంటి కథలు, పాత్రలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్థమవుతాయి. మరి అచ్చమైన తెలుగువారి పరిస్థితి ఏంటి? అలాంటి వారి కోసమే నెట్‌ఫ్లిక్స్‌ ‘మనీ హెయిస్ట్’ సిరీస్‌ తెలుగులోనూ డబ్‌ చేసి అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మనీ హెయిస్ట్ తెలుగులో తీస్తే..’ అంటూ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రొఫెసర్‌గా దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌ కనిపించారు. ఇక తెలుగు సినిమాల్లో సూపర్‌ హిట్‌ అయిన పాత్రలను మిగిలిన టీమ్‌ కింద తీసుకుని, వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఊళ్ల పేర్లను పెట్టారు. నీలాంబరి, చంద్రముఖి, రోబో, మహాద్రష్ట్ర, భళ్లాలదేవ, పశుపతి పాత్రలను ఇందుకోసం ఎంపిక చేశారు. ప్రచారం కోసమే ఈ వీడియో చేసినట్లు అర్థమవుతోంది. నవ్వులు పంచేలా సాగే ఈ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని