హాంకాంగ్‌లో ఘనంగా సాంస్కృతిక ఉత్సవాలు

దక్షిణ చైనా సముద్ర తీరంలోని ‘హాంకాంగ్‌’లో ‘ ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Published : 26 Jan 2024 22:59 IST

హాంగ్‌కాంగ్‌: ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ‘హాంకాంగ్‌’లో సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల వారితోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ.. తెలుగు భాష, దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకి అందించాలన్న లక్ష్యంతో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌, సంక్రాంతి పండుగలను మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు.

ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో ముద్దులొలికే చిన్నారుల ఫ్యాన్సీ డ్రస్‌లు, పద్యాలు, శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్, కూచిపూడి నృత్యాలు, వయోలిన్, కీబోర్డ్, తబలా తదితర వాయిద్య సంగీతంతోపాటు సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం తదితర అంశాల్లో పిల్లలు తమ ప్రతిభతో అందర్నీ మురిపించారు. రజిత, హర్షిత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కౌన్సిలర్‌ కె.వెంకట రమణ, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంకాంగ్‌ అండ్‌ మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ ప్రియా కాంతన్, హాంకాంగ్‌ ఆర్ట్ అఫ్ లివింగ్ టీచర్ సీమా హిరానందాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. చిన్నారుల ప్రతిభను మెచ్చుకొని తల్లిదండ్రుల్ని ప్రశంసించారు. పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతి కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు, వ్యాఖ్యాతలకు, చిన్నారుల తల్లి తండ్రులకు వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని