సేవా సంస్థకు సీపీఆర్ పరికరం అందజేత
అమెరికా న్యూజెర్సీలోని సౌత్ బ్రన్స్విక్‌లో ‘ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్’ స్వచ్ఛంద సేవా సంస్థకు తానా ఫౌండేషన్ రూ.15 లక్షల విలువైన లూకాస్ (మెకానికల్ చెస్ట్ కంప్రెషన్) పరికరాన్ని అందించింది.
తానాను అభినందించిన సౌత్ బ్రన్స్విక్ మేయర్
న్యూజెర్సీ: అమెరికా న్యూజెర్సీలోని సౌత్ బ్రన్స్విక్‌లో ‘ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్’ స్వచ్ఛంద సేవా సంస్థకు తానా ఫౌండేషన్ రూ.15 లక్షల విలువైన లూకాస్ (మెకానికల్ చెస్ట్ కంప్రెషన్) పరికరాన్ని అందించింది. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చీఫ్ శ్రీని వల్లూరి మాట్లాడుతూ... అమెరికాలో ప్రతి ఏడాది 3.50 లక్షల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి వారికి అత్యవసర పరిస్థితుల్లో లూకాస్ ద్వారా సీపీఆర్ చేసి, బతికించుకునే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. అనంతరం సౌత్ బ్రన్స్విక్ మేయర్ చార్లీ కార్లెయ్ మాట్లాడుతూ... ఆరోగ్య రంగంలో ఉన్న సంస్థలను ప్రోత్సహిస్తున్న తానాను అభినందించారు. తమ సేవా కార్యక్రమాలు భారత్, అమెరికాలో నిరంతరం కొనసాగుతాయని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ తెలిపారు. కార్యక్రమంలో నగర కౌన్సిల్ విమెన్ అర్చన గ్రోవర్, మేనేజర్ బ్రయాన్, తానా ప్రతినిధులు శ్రీనివాస్ ఓరుగంటి, విద్యాధర్ గారపాటి, లక్ష్మీ దేవినేని, రాజా కసుకుర్తి, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ నారెపలేపు, శ్రీనాథ్ కోనంకి, రవి కొల్లి, శ్రీనివాస్ చెరుకూరి, సతీష్ మేకా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్