Nara Lokesh: న్యూయార్క్‌లో ఘనంగా నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా నిర్వహించారు.

Published : 23 Jan 2024 22:40 IST

న్యూయార్క్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత టైం స్క్వేర్ వద్ద డిజిటల్ స్క్రీన్‌పై ఆయన వీడియో, చిత్రాలను ప్రదర్శించి కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొని లోకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మన్నవ మోహన కృష్ణ యూత్ సభ్యులు టైం స్క్వేర్ వద్ద ‘జై లోకేశ్‌.. జై జై లోకేశ్‌’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, యువగళం పాదయాత్రతో నారా లోకేశ్‌ ప్రజలకు మరింత చేరువయ్యారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని