దిగ్విజయంగా మొట్టమొదటి అంతర్జాతీయ ‘స్వరరాగ శతావధానం’
స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొట్టమొదటి అంతర్జాతీయ ‘స్వరరాగ శతావధాన’ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ‘వీధి అరుగు- నార్వే’ ‘ఎస్‌ఎస్ మ్యూజిక్ అకాడమీ- ఇంటర్నేషనల్’ సంస్థలు సంయుక్తంగా ఈ అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఏప్రిల్ 14 నుంచి మొదలుకొని ఏప్రిల్ 22 వరకు ఈకార్యక్రమం నిర్విర్వామంగా కొనసాగింది.
ఇంటర్నెట్ డెస్క్: సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొట్టమొదటి అంతర్జాతీయ ‘స్వరరాగ శతావధాన’ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ‘వీధి అరుగు- నార్వే’ ‘ఎస్‌ఎస్ మ్యూజిక్ అకాడమీ- ఇంటర్నేషనల్’ సంస్థలు సంయుక్తంగా ఈ అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14 నుంచి మొదలుకొని ఏప్రిల్ 22 వరకు 17 దేశాల నుంచి సంగీతజ్ఞులైన 108 మంది పృచ్ఛకులు, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది.
సరస్వతీ ఉపాసనే నాదోపాసన.. ఆ నాదోపాసనే స్వరరాగతాళ రసరమ్య రూపమై, నాభీహృత్కంఠరసనాల నుంచి ఉద్భవించడం అనేది ఒక అద్భుతమైన సునాద ప్రక్రియ. అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఇంకోసారి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, రాగతాళరసమార్పుల కూర్పులతో బదులిస్తూ, అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్నిఅలవోకగా అడ్డుకుంటూ, సంగీత పాలసముద్రం చిలకగా వచ్చిన అమృత గుళికల వలే ఈ స్వరరాగావధానాన్ని గరికిపాటి వెంకటప్రభాకర్ ఎంతో హృద్యంగా మలిచారు. ఎంతో సునాయాసంగా, అద్భుతంగా, అవలీలగా గరికిపాటి స్వరరాగావధానం చేశారు. కొన్ని చోట్ల అవధాని రసస్ఫూర్తి అనితరసాధ్యం అనేలా ప్రకటితమైంది. గరికిపాటి ప్రతిభకు ముగ్దులైన ప్రేక్షకులు ఈ అపూర్వసంగీత విషయాల సారాన్ని తెలుసుకుని కరతాళ ధ్వనులతో స్వాగతించారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఖతార్ నుంచి విక్రమ్ సుఖవాసి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా తెలుగు భాషాసేవకులు, భాషాకోవిదులు సముద్రాల లక్ష్మణయ్య కుమారుడు సముద్రాల విజయానంద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు, తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, ఇంకా ఎందరో అతిథులు విచ్చేసి ఈ అమోఘమైన పాండిత్యం చూసి కొనియాడారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ‘వీధి అరుగు- నార్వే’ వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు ముందుతరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయన్నారు. గురువుగారి అపార ప్రతిభాపాటవాలకు, సంగీతానికి చేస్తున్న కృషికి గౌరవ డాక్టరేట్ రావాలని కోరుకుంటూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, పృచ్ఛకులు, ముఖ్య అతిథులు, స్వయంసేవకులు, ప్రత్యక్షముగా, పరోక్షంగా సేవలందించిన వారిని గౌరవ మర్యాదలతో సత్కరించారు. అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పొందుపరిచి నిర్వాహకులు అంగీకార పత్రాన్ని అందజేశారు. అందరికీ శుభం కలగాలని గరికిపాటి ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 4 రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయింది.
పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు..
14 ఏప్రిల్ 2023 (ప్రారంభం): https://www.youtube.com/live/WKIutSKDuug
15 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/fCFCxZBDmh8
15 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/5Ictoq3Dc0k
16 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/rQkF_v0JI-s
16 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/a-wRSMI-JWw
22 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/kHKJ03GAvro
22 ఏప్రిల్ 2023 (ముగింపు): https://www.youtube.com/live/JPx3Dgs4aEM
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు