Election Results 2022: పంజాబ్‌లో ‘సామాన్యుడి’ ప్రభంజనం.. ఎన్ని ఓట్లొచ్చాయో తెలుసా?

పంజాబ్‌లో ఓ ప్రభంజనం.. రెండోసారి ‘సామాన్యుడి’ గురి తప్పలేదు. అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించి.. ఇతర రాజకీయ పక్షాల ఎత్తుల్ని చిత్తుచేసిన .....

Updated : 10 Mar 2022 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లో ఓ ప్రభంజనం.. రెండోసారి ‘సామాన్యుడి’ గురి తప్పలేదు. అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించి.. ఇతర రాజకీయ పక్షాల ఎత్తుల్ని చిత్తుచేసిన ‘ఆప్‌’ పంజాబ్‌లో పెను సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో 2017లో నిరాశ ఎదురైనా.. ఏమాత్రం వెనకడుగు వేయక ఇటీవల చండీగఢ్‌ మున్సి‘పోల్స్‌’ ఫలితాలను టానిక్‌లా మలుచుకొని ఎన్నికల యుద్ధరంగంలోకి దూకిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి పంజాబీలు జేజేలు పలికారు. దిల్లీ తరహా పాలన అందిస్తామన్న కేజ్రీవాల్‌ పరివారం చెప్పిన మాటలను విశ్వసించిన జనం.. భారీగా ఓట్లు, సీట్లు కట్టబెట్టి రికార్డు స్థాయి విజయం అందించారు.

ఓట్లు.. సీట్లు ఇలా..

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. గత ఎన్నికల్లో కేవలం 20 స్థానాల నుంచి భారీగా పుంజుకొంది. రాష్ట్రంలో మొత్తంగా 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో విజయ ఢంకా మోగించి ప్రత్యర్థుల్ని చిత్తుచేసింది. ఇకపోతే, అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం కాగా.. శిరోమణి అకాలీదళ్‌ 3, భాజపా 2, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోచోట విజయం సాధించారు. ఆప్‌ దెబ్బకు కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలంతా వెలవెలబోయారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 65,38,783 ఓట్లు (42శాతానికి పైగా) రాగా.. కాంగ్రెస్‌కు 35,76,684 ఓట్లు (22.98శాతం) మాత్రమే వచ్చాయి. ఇకపోతే శిరోమణి అకాలీదళ్‌కు 28,61,286 ఓట్లు (18.4శాతం) రాగా.. భాజపాకు 10,27,143 ఓట్లు (6.60శాతం), బీఎస్పీకి 2,75,232 ఓట్లు (1.8శాతం), ఇతరులు 11,44,686 ఓట్లు (7.35శాతం) ఓట్లు రాగా.. నోటాకు 1,10,308 ఓట్లు (0.7శాతం) వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని