Purandeswari: పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలి: పురందేశ్వరి

అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ భాజపా స్పందించింది.

Updated : 04 Aug 2023 12:56 IST

విజయవాడ: అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ భాజపా స్పందించింది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే నివాస గృహాలు నిర్మిస్తే మంచిదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు న్యాయం, ధర్మం పక్షం అనేది హైకోర్టు తీర్పుతో రుజువైంది. దేశంలోనే అత్యధికంగా పీఎంఏవై గృహాలను ఏపీకి కేంద్రం కేటాయించింది. పేదల కోసం కేంద్రం కేటాయించిన గృహాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్మించాలి. పనులు పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని