BJP: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై.. కేంద్ర క్యాబినెట్‌లో చర్చ జరగలేదు

‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు.

Updated : 10 Apr 2024 08:47 IST

భాజపా ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌

ఈనాడు, అమరావతి: ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు. రకరకాల ప్రతిపాదనలు వస్తుంటాయి. అవి వచ్చినంత మాత్రానా అమలు చేస్తున్నట్లు కాదు’ అని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసింది. డిజైన్లు మార్చి, వ్యయాన్ని పెంచి గుత్తేదారులకు మేలు చేసేలా ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. తెదేపాతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాం. వికసిత్‌ భారత్‌తోపాటు వికసిత్‌ ఆంధ్రా ప్రధాని మోదీ సంకల్పం’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని