TDP: ‘ఇది పాకిస్థాన్‌ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’: వీడియో షేర్‌ చేసిన తెదేపా

తెదేపా అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Updated : 24 Sep 2023 10:33 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే భారీగా పోలీసులను మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఏపీలోకి విడిచిపెడుతున్నారు. 

హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం

ఈ నేపథ్యంలో తెదేపా స్పందించింది. ‘‘చంద్రబాబుకు మద్దతుగా.. చలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులు ఏపీలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి.. తాడేపల్లి ప్యాలెస్‌లో పిల్లి భయపడుతూ పడుకుంది’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. ‘ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’ అంటూ గరికపాడు వద్ద భారీగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు వీడియోను షేర్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని