సబా కరీంను తొలగించిన బీసీసీఐ

ఇన్నాళ్లూ బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం ఆ పదవికి రాజీనామా చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రణాళికల...

Published : 20 Jul 2020 01:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్నాళ్లూ బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం ఆ పదవికి రాజీనామా చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రణాళికల రూపకల్పనలో అతడి పనితీరు నచ్చకనే బీసీసీఐ కావాలని అతడిని రాజీనామా చేసేలా చేసిందని సమాచారం. ప్రస్తుతం అతడు రిజైన్‌ చేశాడని, నోటీస్‌ పీరియడ్‌లో కొనసాగుతాడని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. త్వరలోనే బోర్డు సభ్యులు కొత్త జనరల్‌ మేనేజర్‌ను నియమిస్తారని చెప్పారు. 

మరోవైపు దేశంలో మార్చి నుంచీ లాక్‌డౌన్‌ విధించడంతో దేశవాళీ క్రికెట్‌ జరగడం లేదు. అదీ కాక ఇప్పుడు కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో క్రికెట్‌ కార్యకలాపాలు సాగేలా కనిపించడం లేదు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడి యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించినా నవంబర్‌ వరకు దేశవాళీ క్రికెట్‌ జరిగే అవకాశాలే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంను తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ఇటీవలే బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ సైతం రాజీనామా చేశాడు. అతడి తర్వాత కరీం వైదొలిగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని