వ్యక్తిగత లక్ష్యాలు లేవు: గిల్‌

ఆస్ట్రేలియా పర్యటనను సవాలుగా తీసుకుంటున్నాని, జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే వ్యక్తిగత లక్ష్యాలు లేవని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు.

Published : 23 Nov 2020 23:14 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనను సవాలుగా తీసుకుంటున్నానని, జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే వ్యక్తిగత లక్ష్యాలు లేవని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా పర్యటనను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ఇదే నా తొలి పర్యటన. చిన్నతనంలో భారత్×ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ఆస్వాదించేవాడిని. జట్టులో ఎంతో మంది స్నేహితులతో ఆస్ట్రేలియాకు పయనమవ్వడంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నా. అయితే ప్రాక్టీస్ సెషన్‌ ఆరంభమైన తర్వాత మా ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాగా, ఈ పర్యటనలో వ్యక్తిగత లక్ష్యాలేవీ లేవు, సవాళ్లను ఎదుర్కోవాలనుకుంటున్నా’’ అని కోల్‌కతా జట్టు ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో గిల్ పేర్కొన్నాడు.

నవంబర్‌ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాలో పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా, గిల్ వన్డే, టెస్టు జట్టులో ఉన్నాడు. సిడ్నీ వేదికగా శుక్రవారం జరగనున్న తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్‌లో గిల్ నిలకడైన ప్రదర్శన చేశాడు. యూఏఈ వేదికగా జరిగిన 13వ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని