సచిన్‌ సైక్లింగ్‌.. మారడోనా ఆట.. కైఫ్‌ బర్త్‌డే!

సచిన్‌ తెందూల్కర్‌ సైక్లింగ్‌, మారడోనా ఆట, కైఫ్‌ బర్త్‌డే ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మాజీ క్రికెటర్లు సచిన్‌, గంగూలీ, సురేశ్‌ రైనా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్న విశేషాలు...

Updated : 01 Dec 2020 13:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ సైక్లింగ్‌, మారడోనా ఆట, కైఫ్‌ బర్త్‌డే ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మాజీ క్రికెటర్లు సచిన్‌, గంగూలీ, సురేశ్‌ రైనా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్న విశేషాలు. లిటిల్‌ మాస్టర్‌ వీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తూ సరదాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో సైక్లింగ్‌ చేసిన వీడియోను పోస్టు చేయగా, గంగూలీ ఇటీవల కన్నుమూసిన ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా ఆటను అభిమానులతో పంచుకున్నాడు. ఇక సురేశ్‌ రైనా తన సహచర ఆటగాడు, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ కైఫ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. 

* సమతూకం, ఫుట్‌వర్క్‌ అనే విషయాలు జీవితంలో ఎప్పటికీ ముఖ్యమైనవే.     -సచిన్‌ తెందూల్కర్‌

* అసలైన మేధావి డీగో. ఫుట్‌బాల్‌ గేమ్‌ను ఇతడి కంటే మెరుగ్గా ఆడే ఆటగాడిని నేను చూడలేదు.    -సౌరభ్‌ గంగూలీ

* పుట్టినరోజు శుభాకాంక్షలు కైఫ్ భాయ్‌. టీమ్‌ఇండియాకు, ఉత్తరప్రదేశ్‌ జట్టుకు మనం అందించిన విజయాలను గుర్తుచేసుకుంటున్నా. మీ భవిష్యత్‌ మొత్తం బాగుండాలని కోరుతున్నా.      -సురేశ్‌ రైనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని